హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ నేతల కట్టడికే చంద్రబాబు హెచ్చరికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీకి తన చేత లేఖ ఇప్పించాలని పార్టీ తెలంగాణ నేతలు పట్టు పడుతుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెత్తాన్ని తీశారు. తెలంగాణ నేతల కార్యకలాపాలను క్రమశిక్షణ ఉల్లంఘించడంగా భావించి వేటు వేసేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలను చూపి పార్టీని గాడిలో పెట్టే నెపంతో తెలంగాణ నేతల నోళ్లు మూయించేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. సీమాంధ్ర, తెలంగాణ ఇరు ప్రాంతాల నేతలు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్లాలని, అంతే తప్ప తాను ఒకే వైఖరితో ఉండాలనడం సరికాదని ఆయన గట్టిగా చెబుతున్నారు. తాను శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇవ్వబోనని, లేఖ ఇవ్వాలని తనను ఎవరూ కోరలేదని ఆయన చెప్పడాన్ని బట్టి తెలంగాణ నేతల పట్ల ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

సమస్యను సృష్టించిన కాంగ్రెస్‌ తాపీగా ఉండగా, తమ పార్టీ నాయకులు కొంత మంది అనవసరంగా ఆందోళన చెందుతున్నారని, ఇది పార్టీకి లబ్ధి చేసే విధంగా లేదని చంద్రబాబు అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.. సీమాంధ్రలో అయినా, తెలంగాణలో అయినా ప్రజల భావోద్వేగాలను గౌరవించడమే కాక, దాన్ని పార్టీకి అనుకూలంగా మలిచేలా నాయకులు కార్యాచరణ రూపొందించుకోవాలని గట్టిగా సూచిస్తున్నారు. ఇందుకు భిన్నంగా పార్టీని విస్మరిస్తూ, ఏకపక్షంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రతిష్ఠ పొందాలని చూసే వారిపై కఠినంగా వ్యవహరించాలని బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో తమ మనుగడకు ప్రమాదం వాటిల్లిందని బెంగ పడుతున్న పార్టీ నేతల వైఖరిపైనే చంద్రబాబు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X