వైయస్ జగన్ మనస్తాపం: మీడియాకు దూరం

ఆయన గురువారం సాయంత్రం లేదా శుక్రవారంనాడు హైదరాబాదు తిరిగి వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాదులో తన సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు వ్యూహాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఒక వైపు సురేఖ వివాదం రగులుతుండగానే అంబటి రాంబాబు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కె. రోశయ్యపై, పార్టీ నాయకత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సురేఖ బహిరంగ లేఖ రాయబోతున్నట్లు జగన్ కు ముందు తెలియదని ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ, సురేఖ, అంబటి రాంబాబు ఏ పని చేసిన జగన్ వ్యూహంలో భాగంగానే జరుగుతోందనే అభిప్రాయం కచ్చితంగా ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications