వైయస్ జగన్ రోశయ్యను పడగొడతానంటే మద్దతుకు చిరు రెడీ

తెలుగువారందరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు వాళ్లకు ఒకే రాష్ట్రం ఉండాలన్నారు. 'రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటే దేశ ద్రోహమా?' అని నిలదీశారు. ఎన్టీఆర్ మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని చిరంజీవి మండిపడ్డారు. 2004లో కాంగ్రెసు ప్రభుత్వం మద్యపాన నిషేధానికి కృషి చేస్తామని ప్రకటించి, ఇప్పుడు ఇంటింటికి బెల్టుషాపులు తెరిచిందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు మద్యం తాగి ఒళ్లుగుళ్ల చేసుకుంటున్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications