వైయస్ జగన్ ను ప్రత్యేకంగా ఉద్దేశించి అనలేదు: చిరంజీవి

Chiranjeevi
నెల్లూరు: అవినీతికి సంబంధించి తాను ఏ ఒక్కరినో ఉద్దేశించి మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని, అందుకే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తాను అవినీతి ఆరోపణలు చేసినట్లు రాసిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన నేతలందరికీ తన వ్యాఖ్యలు వర్తిస్తాయని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలు అవినీతిపైనే తప్ప ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావని ఆయన అన్నారు. మీడియా ఒత్తిడి వల్లనే తాను కాంగ్రెసుకు మద్దతిస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసుకు మద్దతిస్తానని తాను అనుకుని చెప్పిన మాటలు కావని ఆయన అన్నారు.

ప్రతిపక్షమంటే ప్రభుత్వాన్ని చీల్చిచెండాడం కాదని తన అభిప్రాయమని ఆయన అన్నారు. మంచీచెడులను బేరీజు వేసుకుని మంచిని ఆహ్వానించడం, చెడును తప్పు పట్టడం ప్రతిపక్షం చేయాల్సిన పని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీలో పూర్తి ప్రజాస్వామ్యం ఉందని ఆయన మహిళారాజ్యం నేత శోభారాణి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించినప్పుడు అన్నారు. పార్టీ బలానికి ప్రజాసమస్యలపై ఏ మేరకు పోరాటం చేస్తున్నామనేది ప్రతీక అని ఆయన అన్నారు.

తనలో కళాకారుడు ఇంకా బతికే ఉన్నాడని ఆయన అన్నారు. ప్రజలకు సందేశమిచ్చే చిత్రంలో నటించడానికి తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అయితే సమయం సరిపోతుందా లేదా, సమయాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలి అనేదే సమస్య అని ఆయన అన్నారు. అందుకే సినిమాల్లో తిరిగి నటించడంపై జాప్యం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+