సాక్షి డైలీ ప్రస్తావించిన మంత్రి బొత్స సత్యనారాయణ?

చిరంజీవి చేసిన ఆరోపణలను సమర్థించిన కాంగ్రెసు నాయకులు వి హనుమంతరావు, కె. కేశవరావుల వెనక, చిరంజీవి ఆరోపణల వెనక మరో ప్రముఖ కాంగ్రెసు నాయకుడి హస్తం ఉన్నట్లు కూడా సాక్షి దినపత్రిక ఆరోపించింది. ఆ నాయకుడు బహుశా పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఉద్దేశించి సాక్షి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. డి. శ్రీనివాస్ కాపు కులానికి చెందినవాడు కావడం కూడా సాక్షి అంచనాకు కారణం కావచ్చు. బొత్స సత్యనారాయణ, రోశయ్య, డి. శ్రీనివాస్ కలిసి జగన్ ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారనేది సాక్షి వార్తాకథనం అంతరార్థమై ఉంటుందని భావిస్తున్నారు. కేశవరావు, హనుమంతరావు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారే కావడం కూడా సాక్షి వ్యాఖ్యకు కారణమై ఉంటుంది.












Click it and Unblock the Notifications