చంద్రబాబు నాయుడు హెచ్చరికపై తెరాస అధినేత కెసిఆర్ ధ్వజం

K Chandrasekhar Rao
హైదరాబాద్: తనను హెచ్చిరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు బాబ్లీ వ్యతిరేక పోరు డూప్లికేట్ అని, దాన్ని ఎన్నికల్లో ప్రజలు నిరూపించారని ఆయన అన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. తెలంగాణలో పూర్తి కాని ప్రాజెక్టులపై చంద్రబాబు మాట్లాడడం లేదని, బాబ్లీ వ్యతిరేక పోరు అంటూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో నిజాం హయాం నుంచి చేపట్టిన ప్రాజెక్టులను చేపట్టకుండా, సరిగా నిర్వహించకుండా ఎలా మోసం చేస్తున్నారో ఆయన వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్వహణ దారుణంగా ఉందని, దాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ అన్యాయాల గురించి మాట్లాడకుండా చంద్రబాబు బాబ్లీ పోరాటం చేస్తే ప్రజలను నమ్మబోరని ఆయన అన్నారు.

రైతులకు ఎరువులు అందడం లేదని ఆయన అన్నారు. అవసరమైన మందులు కాకుండా ఇష్టం వచ్చిన మందులను బలవంతంగా రైతులపై రుద్దుతున్నారని ఆయన అన్నారు. రైతాంగ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు. ఎరువుల కొరతను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. విత్తనాల కొరతను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. విషజ్వరాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. గెలిచింది తెరాస కాదని, తెలంగాణవాదని, ఇది ప్రజల విజయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై తాను భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు బహిరంగ లేఖ రాస్తానని ఆయన చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు అంచనాలు పెంచి కోట్లకు కోట్లకు దండుకున్నారని, ప్రాజెక్టు మాత్రం పూర్తి కాదని ఆయన అన్నారు. పోరాడితే తప్ప సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు కోస్తాంధ్రకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తారని, తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఎస్ ఆర్ ఎస్పీ ప్రాజెక్టు నిర్వహణకు ఏళ్ల తరబడిగా ఒక్క పైసా ఇవ్వలేదని, చంద్రబాబు హయాంలో కూడా పైసా ఇవ్వలేదని, కానీ దొంగ నాటకాలు ఆడుతారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+