వైయస్ జగన్ పై చిరంజీవి వ్యాఖ్యలకు పాల్వాయి ఓటు

Palwai Govardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సమర్థించారు. అతి కొద్ది కాలంలో వ్యాపారం ద్వారా భారీ సంపాదన సాధ్యం కాదని, రాజకీయాల ద్వారానే అది సాధ్యమవుతుందని చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అక్రమార్జన చేస్తున్న నాయకుల వివరాలు తమ పార్టీ అధిష్టానం వద్ద ఉన్నాయని, త్వరలోనే వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

సాగునీటి అధికారులు, ఇంజినీర్లతో కలిసి మంత్రి పొన్నాల లక్ష్మయ్య జలయజ్ఞంపై రోశయ్యను తప్పుదోవ పట్టిస్తున్నారని గోవర్థన్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల్లో భారీస్థాయిలో అవకతవకలు జరిగాయని, వీటన్నింటిపై ముఖ్యమంత్రి కె. రోశయ్య దృష్టి సారించాలన్నారు. పొన్నాల వల్ల తెలంగాణకు చుక్కనీరు కూడా రాలేదని విమర్శించారు. పోలవరం సహా ఇతర జలయజ్ఞం ప్రాజెక్టులపై రిటైర్డు ఇంజినీర్లతో కమిటీవేసి అధ్యయనం చేయాలని సీఎంను కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయకుండా పోతిరెడ్డిపాడు ద్వారా కిందికి తరలించాలని ప్రయత్నిస్తే ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+