చిరంజీవి మద్దతిస్తే తీసుకుంటాం: సిఎం రోశయ్య

జగన్ యాత్రలో పాల్గొనాలా, వద్దా అనే సందేహం ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పార్టీని సంప్రదించి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదని రోశయ్య పేర్కొన్నారు. సమస్య ఉన్నందునే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించిందని చెప్పారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. మునిసిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, మహిళలకు 50శాతం రిజర్వేషన్ల కేటాయింపు అంశంపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలపై పోరాడే స్వేచ్ఛ చంద్రబాబుకు ఉందని రోశయ్య పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications