రాజశేఖర్, జీవిత దంపతులపై అల్లు అరవింద్ ఫిర్యాదు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై దుష్ప్రచారాలు మాని, కళ్లు తెరచి వాస్తవాలు గ్రహించాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. కేవలం స్వార్థ ప్రయోజనాలు ఆశించే రాజశేఖర్, జీవితలు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరోపణలు చేసేవారెవరైనా స్వయంగా బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి నిజాలు తెలుసుకోవాలని ఆయన సవాల్ విసిరారు. సామాజిక సేవతో ప్రారంభించిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది చిరంజీవి అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ నిరసనను తెలిపారు.












Click it and Unblock the Notifications