కె చంద్రశేఖర రావుతో నరసింహన్ రహస్య భేటీ మతలబు ఏమిటి?

గవర్నర్ తో మాట్లాడి వచ్చిన కెసిఆర్ ను మీడియా ప్రతినిధులు కలుసుకున్నారు. వారికి భేటీ వివరాలను ఆయన వెల్లడించలేదు. గవర్నర్‌తో ఏం మాట్లాడారన్న విలేకరుల ప్రశ్న 'మంచీ చెడ్డ మాట్లాడాను. విశేషం ఏమీ లేదు. బయటకు వస్తుంటే 2 నిమిషాలు మాట్లాడదామని గవర్నర్ అంటే ఉండిపోయాను' అని చెప్పారు. రాజకీయాలు చర్చకు వచ్చాయా? అని ప్రశ్నించగా, 'రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయి. ఒక పార్టీ అధ్యక్షుడు, గవర్నర్ కలుసుకుంటే రాజకీయాలే కాదు, అన్నీ ఉంటాయి. ఎవ్రీ థింగ్ ఫాలోస్' అని బదులిచ్చారు. 'ఏం చర్చించారు?' అని మీడియా ప్రతినిధులు మరోసారి అడిగితే, 'చెప్పాల్సినవి చెప్పాం, చెప్పకూడనివి చెప్పలేదు' అని నవ్వుతూ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications