నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మరో స్వైన్ ఫ్లూ మృతి సంభవించింది. వినోద అనే గృహిణి శనివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో స్వైన్ ఫ్లూతో నలుగురు మరణించారు.
నల్లగొండ జిల్లాలో ఇంకా 20 మంది దాకా స్వైన్ వ్యాధి పీడితులు ఉంటారని భావిస్తున్నారు. జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. అయినా అధికారులు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.