వైయస్ జగన్ ను ఒంటరి చేసే వ్యూహంతో సోనియా ఆదేశాలు

సోనియా తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి పార్లమెంటు సభ్యులు ఆమెను కలుస్తున్నారు. ఈ సమయంలో వారితో సోనియా నింపాదిగా మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల గురించి ఆరా తీస్తున్నారు. జగన్ ప్రస్తావన రాగానే ఆమె నిక్కచ్చిగానే తన నిర్ణయాన్ని చెబుతున్నారని తెలుస్తోంది. జగన్ యాత్రకు ఎవరూ వెళ్లవద్దని ఆమె ఆదేశిస్తున్నట్లు సమాచారం. శాసనసభ్యులకు, స్థానిక నాయకులకు కూడా ఈ విషయం తెలియజేయాలని ఆమె ఎంపిలకు సూచిస్తున్నారు. సోనియా వైఖరి స్పష్టంగా తెలియడంతో ఉత్తరాంధ్ర మహిళా ఎంపి తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణకు చెందిన ఓ యువ ఎంపి కూడా పూర్తిగా మారిపోయారు. మొత్తం మీద జగన్ ను ఒంటరి చేయడమే పనిగా సోనియా పావులు కదుపుతున్నారు.












Click it and Unblock the Notifications