6 వారాల రికార్డును బద్దలు కొట్టిన చమురు ధరలు..

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ చమురు మంటలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ద మేఘాలు అంతర్జాతీయ మార్కెట్‌ను తీవ్ర అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ప్రత్యక్ష దాడులు, మరోవైపు ఎర్రసముద్రంలో హూతీ తిరుగుబాటుదారుల దాడులతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గడిచిన ఆరు వారాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకోవడంతో అంతర్జాతీయంగా మళ్లీ ద్రవ్యోల్బణ భయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు నిమిష నిమిషానికి తీవ్రంగా ఉగిసలాడుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణమైన 'బ్రెంట్ క్రూడ్' ధర రెండు శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 96 డాలర్ల మార్కును తాకింది. జూన్ మొదటి వారం తర్వాత ఈ స్థాయి ధర నమోదు కావడం ఇదే తొలిసారి. రోజు వ్యవధిలోనే బ్యారెల్‌పై ఏకంగా రెండు డాలర్ల వరకు ధర పెరగడం చమురు మార్కెట్‌లోని తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే అమెరికా డబ్ల్యూటీఐ రకం ముడిచమురు ధర కూడా 1.7 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 88.27 డాలర్లకు చేరుకుంది.

US Iran Conflict Escalates Crude Oil Prices Surge to Multi Week Highs Driven by Supply Disruptions

హోర్ముజ్ జలసంధిపై పెరిగిన ఉద్రిక్తతలు

అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యంగా వరుస దాడులకు దిగడం పరిస్థితిని మరింత దిగజార్చింది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై దాడులు జరిగితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఇరు దేశాల అధినేతలు హెచ్చరించుకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఇదే సమయంలో జలసంధి దారిలో ఒక నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగడం, మిగిలిన నౌకలు వెనక్కి మళ్లడం వంటి పరిణామాలు సముద్ర రవాణాను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని తమ అనుమతి లేకుండా వినియోగించనిచ్చేది లేదని ఇరాన్ దళాలు స్పష్టం చేయడంతో షిప్ ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఎర్రసముద్రంలో హూతీల పంజా

మరోవైపు ఎర్రసముద్రంలో యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు కొత్త పోరును మొదలుపెట్టారు. సౌదీ అరేబియాకు చెందిన చమురు రవాణా నౌకలే లక్ష్యంగా వారు క్షిపణి దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే కొన్ని ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరగడంతో మిగిలిన నౌకలు దారి మళ్లి పోతున్నాయి. ఆంక్షలు ధిక్కరించి సౌదీ రేవుల వైపు వెళ్లే ఏ నౌకనూ వదిలిపెట్టబోమని హూతీలు హెచ్చరించడంతో ఎర్రసముద్రంలో నౌకల రాకపోకలకు పెద్ద విఘాతం కలిగింది. ఫలితంగా గల్ఫ్‌ ప్రాంతం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్త ఇంధన సరఫరా వ్యవస్థకు తీవ్ర ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.

పెరిగిన నిల్వలు.. అయినా తగ్గని వేడి

సాధారణంగా అమెరికాలో ముడిచమురు నిల్వలు పెరిగితే ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఈ వారంలో అక్కడ చమురు నిల్వలు అంచనాల కంటే ఎక్కువగా పెరిగినప్పటికీ, పశ్చిమాసియాలోని యుద్ద భయాల ముందు ఈ అంశం నిలవలేకపోయింది. సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందనే ఆందోళనలతో అంతర్జాతీయంగా చమురు కొనుగోళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు తగ్గకపోతే క్రూడాయిల్ సెగ సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+