రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా: ప్రధాని మోదీకి పాక్ మాజీ క్రికెటర్ సపోర్ట్!
ఢిల్లీలో గత మూడు రోజులుగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వంలో నీట్‌తో పాటు పలు ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని.. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ నిరసనలకు కాంగ్రెస్ కూడా తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వివాదాస్పద కామెంట్స్ చేశారు. భారత్‌లో జరిగే ప్రతి నిరసనకు ఒకే స్క్రిప్ట్ ఉంటుందని బాంబు పేల్చారు. విద్యార్థుల నిరసనల వెనుక కూడా కుట్రకోణం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాముడిని, మోదీని తిట్టడమే నిరసనా? అంటూ డానిష్ కనేరియా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో విద్యార్థులు నిరసనలు చేస్తున్న తరుణంలో పాక్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా ఈ వివాదాస్పద పోస్ట్ పెట్టి రచ్చ లేపాడు. ఇటీవల కాలంలో భారత్ లో అనేక గొడవలు జరుగుతున్నాయి.. ప్రతి నిరసనకూ ఒకే స్క్రిప్ట్ ఉంటోందని ఆయన విమర్శించారు. నిరసనలు ఎప్పుడు జరిగినా రాముడు, భారత మాత, హిందుత్వం, మోదీ, అలాగే ఆయన తల్లిని దూషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివాదాలు జరిగినపపుడు చర్చలు, పరిష్కారాలు ఏమీ లేవని.. నినాదాలు, దూషణలు, గందరగోళాలే ఇండియాలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇండియాలో కూడా నేపాల్ వంటి పరిస్థితులు వస్తాయని విపక్షాలు కలలు కంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ జరగకముందే కొందరు రైతులు ఢిల్లీని బ్లాక్ చేసేందుకు వెళ్లడం ఏంటో? ఇది సర్కస్ లాగా మారుతోందంటూ పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ట్వీట్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై డానిష్ కనేరియా మరో వీడియోను కూడా పోస్ట్ చేశారు. శాంతియుత నిరసనల పేరుతో కొందరు కత్తులు తీసుకువచ్చారంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులపై కత్తులతో దాడులు చేసేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలని డానిష్ కనేరియా సూచించారు.
I am disturbed because every protest in India seems to have the same script.
— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026
1. Abuse Lord Ram.
2. Abuse Bharat Mata.
3. Abuse PM Modi.
4. Abuse PM Modi’s late mother.
5. Abuse Brahmins.
6. Abuse Hindutva.
No discussion.
No solutions.
Only slogans, abuse, and chaos.
The…
Look at the NEET aspirants. 😀 pic.twitter.com/VbOcqArOyG
— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026












Click it and Unblock the Notifications