SIR: లాస్ట్ ఛాన్స్! రేపటితో ముగియనున్న గడువు.. మీ ఓటు చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ అత్యంత కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఎన్యూమరేషన్ గడువు రేపటితో (జులై 24) ముగియనుంది. పూర్తి చేసిన ఫారమ్‌లను సమర్పించడానికి, వాటిని ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే అవకాశం ఉంది.

ఒకవేళ మీ ఎన్యూమరేషన్ ఫామ్‌ను బీఎల్ఓలకు తిరిగి ఇవ్వకపోయినా, లేదా అది ఆన్‌లైన్‌లో నమోదవకపోయినా ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 100 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ, మీ ఓటు భద్రంగా ఉందో లేదో సరిచూసుకోవడం మీ బాధ్యత. కాగా, తెలంగాణలో ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగింపునకు ఆగస్టు 3 వరకు గడువు ఉంది.

SIR AP Voter List Revision 2026 Ends Tomorrow Check Your Vote Status Via SMS Now to Avoid Name Deletion

SMS ద్వారా మీ ఓటును ఎలా సరిచూసుకోవాలంటే..

ఓటరు లిస్టులో మీ పేరు నమోదై ఉందో లేదో తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ఎంతో సులువైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. మీరు ఇంట్లో ఉండే మీ మొబైల్ ద్వారా ఒక్క SMS పంపి వివరాలు తెలుసుకోవచ్చు.

  • ముందుగా మీ ఫోన్‌లోని మెసేజ్ యాప్ ఓపెన్ చేయండి.
  • అందులో ECI అని టైప్ చేసి, ఒక స్పేస్ ఇచ్చి మీ ఓటరు ఐడీ (EPIC) నంబరును ఎంటర్ చేయండి. (ఉదాహరణకు: ECI ABC1234567)
  • ఈ సమాచారాన్ని 1950 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు SMS పంపండి.

రిప్లై రాకపోతే ఆందోళన వద్దు

మెసేజ్ పంపిన కొద్దిసేపటికే మీ వివరాలతో తిరుగు సందేశం (Reply) వస్తే మీ ఓటు సురక్షితంగా నమోదైనట్లే. ఒకవేళ నెట్‌వర్క్ లేదా సాంకేతిక కారణాల వల్ల ఎలాంటి రిప్లై రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మెసేజ్ రాలేదనే మాత్రాన ఓటు తొలిగించారని భావించలేము. అటువంటి సందర్భాల్లో నేరుగా మీ గ్రామ లేదా వార్డు బి.ఎల్.ఓ (BLO) అధికారిని కలిసి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో క్రాస్ చెక్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+