కేబినెట్ భేటీ: ఉద్యోగుల బకాయిలు, కరోనా, స్థానిక సంస్థల ఎన్నికల పై కీలక నిర్ణయాలు..!!

ఏపీలో కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కు ప్రభుత్వం సమాయత్తం అయింది. ముందస్తుగానే మంత్రులకు సీఎం చంద్రబాబుకు ఎన్నికల కోసం బిగ్ టాస్క్ అప్పగిస్తున్నారు. అదే విధంగా ఉద్యోగుల సమస్యలు... పెరుగుతున్న కరోనా కేసుల పైనా ప్రభుత్వం చర్చలు చేస్తోంది. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో అమరావతి, ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. డీలిమిటేషన్ బిల్లు సహా కీలక అంశాల పైన చర్చించనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీలు- కార్పోరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతో పోలింగ్ జరిగే విధంగా కార్యాచరణ సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి కూటమి పార్టీల సమన్వయం.. కూటమి పార్టీల విజయం పైన మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చలు చేసింది. పెండింగ్ బకాయిల విడుదల పైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు పెడింగ్ డీఏల విషయంలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ కావాలని డిసైడ్ అయ్యారు.

cm-chandra-babu-likely-to-announce-big-decisions-in-todays-cabinet-meet-amid-delimitation-bill-and

కేబినెట్ భేటీలో కీలక దిశా నిర్దేశం

అదే విధంగా ఆగస్టు 1న ప్రధాని మోదీ ఏపి పర్యటనకు రానున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఇక.. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల తో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్ లో ఆమోదం దిశగా తుది కసరత్తు కొనసాగుతోంది. ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఢిల్లీ పర్యటన అంశాలను చంద్రబాబు సహచర మంత్రులకు వివరించే అవకాశం కనిపిస్తోంది. ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను మంత్రిమండలి పరిశీలించనుంది. రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజాసేవల మెరుగుదలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+