అనవసరంగా వైయస్సార్ పేరు లాగొద్దు: భూమన కరుణాకర్ రెడ్డి

Bhumana Karunakar Reddy
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వ్యవహారాల్లోకి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరును లాగవద్దని టిటిడి మాజీ చైర్మన్, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అనుచరుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపక్షాలను కోరారు. తాను వైయస్ అనుంగు శిష్యుడినని, అందుకు గర్విస్తున్నానని ఆయన అన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన హయాంలో టిటిడి అవినీతికి పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవాలని, తాను ఏ విచారణకైనా సిద్ధమని, తన హయాంలో అవినీతి జరిగినట్లు రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు.

తాను హిందువుగా పుట్టానని, హిందువుగా జీవిస్తున్నానని ఆయన చెప్పారు. తాను విప్లవ రాజకీయాల్లో పనిచేసిన మాట వాస్తవమని, అంత మాత్రాన దేవుడి మీద గానీ హిందూ సంప్రదాయాల మీద గానీ నమ్మకం లేదని చెప్పడం మంచిది కాదని ఆయన అన్నారు. తన హయాంలో ధార్మిక కార్యక్రమాలు చేపట్టానని, హిందూ ధార్మిక సంప్రదాయాలను ప్రచారం చేయడానికి కార్యక్రమాలు చేపట్టానని, రాజకీయ కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన వివరించారు. ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తిగా తల దించుకుని బతకాల్సిన అవసరం తనకు లేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+