వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాల్గొంటారా?

Daggubati Venkateswara Rao
ఒంగోలు: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రకాశం జిల్లాలో జరిపే ఓదార్పు యాత్రలో శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాల్గొంటారా అనేది ఆసక్తికమైన విషయంగా మారింది. అదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఓదార్పు యాత్రకు వెళ్లాలా, వద్దా అనే విషయం తన మదిలోకి ఇంకా రాలేదని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలవడానికి సచివాలయం వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆ విషయం ఇంకా తన మదిలోకి రాలేదని జవాబిచ్చారు. అయితే, రాజకీయ వ్యక్తిత్వం దృష్ట్యా దగ్గుబాటి జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవు. జగన్ నాయకత్వాన్ని అంగీకిరంచాల్సిన అవసరం ఆయనకు రాజకీయంగా గానీ ఇతరేతరంగా గానీ ఏ మాత్రం లేదు. ఆయన కాంగ్రెసు అభ్యర్థిగా ప్రకాశం జిల్లా నుంచి శాసనసభకు ఎన్నికైనప్పటికీ నామమాత్రంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెసులోని అంతర్గత రాజకీయాలకు కూడా ఆయన అతీతంగానే ఉంటున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్నారు. నిర్వహించేది సహాయ మంత్రి పదవే అయినా ఆమెకు ఇతోధిక ప్రాధాన్యం లభిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ఆమెకు మంచి పలుకుబడి ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురిగానే కాకుండా, వ్యక్తిత్వం రీత్యా కూడా ఆమె ఆ పలుకుబడిని, మంచి పేరును సంపాదించుకున్నారు. మన్మోహన్ మంత్రివర్గంలో క్రియాశీలకంగా చురుగ్గా పని చేసే మంత్రుల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు. అందువల్ల దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు గానీ, పురంధేశ్వరికి గానీ జగన్ నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆ వివాదానికి దూరంగా ఉండగలిగే తాహతు, స్తోమత ఆ దంపతులకు ఉంది. పురంధేశ్వరి వివాదాలకు తావు ఇవ్వని మంత్రిగా పేరు పొందారు. అందువల్ల జగన్ ఓదార్పు యాత్ర దగ్గుబాటి ఓ మామూలు వ్యవహారం మాత్రమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+