ఓదార్పుపై హైకమాండ్ కట్టడి: వైయస్ జగన్ దూకుడు

బాలినేని శ్రీనివాస రెడ్డి సుబ్బారెడ్డికి సమీప బంధువు. గత ఎన్నికల్లో శాసనసభ టికెట్లను సుబ్బారెడ్డే ఇప్పించారు. దీంతో ఓదార్పు యాత్రలో పాల్గొనాలని సుబ్బారెడ్డి శాసనసభ్యులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్టానం నుంచి ఆదేశాలు లేవని బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. దీంతో అధిష్టానం నేరుగా రంగంలోకి దిగితే తప్ప ఓదార్పు యాత్రను కట్టడి చేయడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. ఈ స్థితిలో ముందుగా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై ఒత్తిడి తేవాలని అధిష్టానం భావిస్తోంది. బాలినేని శ్రీనివాస రెడ్డి దారికి రాకపోతే నేరుగా మొయిలీ ప్రకటన చేసే అవకాశం ఉంది. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని ఆదేశాలు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో జగన్ తన రాజకీయాలకు పదును పెడుతారని అంటున్నారు. అధిష్టానంపై నేరుగా యుద్ధం ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అధిష్టానం చొరవతో జగన్ కు అనుకూలంగా ఉన్న కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కాస్తా వెనక్కి తగ్గారు. ఓదార్పు యాత్రలో పాల్గొనేది లేదని పార్లమెంటు సభ్యురాలు వనబాక లక్ష్మి ప్రకటించారు. ఏమైనా ప్రకాశం జిల్లాలో జగన్ రాజకీయ భవిష్యత్తు అటో ఇటో తేలిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications