ప్రకాశం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర రోశయ్యకు సవాల్

మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడు సుబ్బా రెడ్డి ప్రత్యేకంగా జగన్ ఓదార్పు యాత్రను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు సాగిస్తున్నారు. ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి లేదన్నదానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర మంత్రుల వద్ద, ప్రజాప్రతినిధుల వద్ద స్పందించిన తీరే నిదర్శనమని రోశయ్య అన్నట్లు సమాచారం. ఓ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు తనను సోమవారం కలిసినప్పుడు ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. సోనియా సర్వసాధారణంగా తన మనసులో మాట బయట పెట్టరని, రాష్టానికి చెందిన కేంద్ర మంత్రుల వద్ద, పార్లమెంటు సభ్యుల వద్ద ఆమె స్పందించారంటే తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చునని రోశయ్య అన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications