'సత్యం' రాజు ఆరోగ్యంపై మా నివేదిక నిజమే: నిమ్స్ వైద్యులు

రాజు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని వారు చెప్పారు. కాలేయం పూర్తిగా దెబ్బ తిన్నదని వారు చెప్పారు. తాము ఇచ్చిన బ్లడ్ కౌంట్ నిజమేనని, రాజుకు ఆరోగ్య సమస్య నిజమేనని వారు చెప్పారు. రామలింగరాజు ఆరోగ్యాన్ని ఇతర వైద్యులు కూడా పరీక్షించవచ్చునని వారన్నారు. ఆస్పత్రి నుంచి వెళ్లాలని తాము రామలింగ రాజుపై ఒత్తిడి తేలేమని వారు చెప్పారు. బెయిల్ ఇస్తే రామలింగరాజు సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అనుమానాలు అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది భరత్ కుమార్ అన్నారు. సత్యం కంప్యూటర్స్ ప్రస్తుతం మహీంద్రా చేతిలో ఉందని, రాజు చైర్మన్ గా కూడా లేరని, అందువల్ల సాక్ష్యాలను తారుమారు చేయడం సాధ్యం కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనికి సంబంధించి అన్ని విషయాలను కోర్టు ముందుంచామని, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
