బాగ్దాద్: ఇరాక్‌లోని బాగ్దాద్ లో గల ఓ ఆర్మీ రిక్రూట్‌మెంట్ క్యాంపులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 61 మంది మృతి చెందారు. సైన్యంలో చేరాలనే తపనతో సుమారు 1000 మంది అభ్యర్థులు ఈ క్యాంపునకు హాజరయ్యారు. వీరి మధ్యలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా గంటల తరబడి కూర్చొని తర్వాత తనను తాను పేల్చివేసుకున్నాడు. ఈ పేలుడులో పదుల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
దరఖాస్తులు పట్టుకుని నిలుచున్న వందలాది మందికి ఏ విధమైన భద్రత కల్పించలేదు. ఐడి కార్డులు స్వీకరిస్తున్న ఓ అధికారి వద్దకు ఆత్మాహుతి దళ సభ్యుడు వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు.