కాకా బెదిరిస్తున్నారు, ఆ భూమి మాదే: శ్రీకాంత్

తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేయించేందుకు కాకా మనుషులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కాకా కుమారుడు వినోద్ సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కూడా తమకు మద్దతుగా ఉందని ఆయన చెప్పారు. తానెప్పుడూ వివాదాల్లో తలదూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు శత్రువులెవరూ లేరని ఆయన అన్నారు. కాకా భూమి పక్కనే తాను భూమి కొనడమే తప్పయి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు కొత్త వివాదాన్ని తెర మీదికి తెస్తున్నారని, తాను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిరూపిస్తే భూమిని వదిలేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య, గవర్నర్ నరసింహన్ లను కలిసి ఈ విషయాన్ని వివరిస్తానని ఆయన అన్నారు. భూవిక్రేతలతో కూడా శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడించారు.












Click it and Unblock the Notifications