కరీంనగర్ లో చంద్రబాబును అడ్డుకున్న తెలంగాణవాదులు

Chandrababu Naidu
కరీంనగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కరీంనగర్ జిల్లాలో ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. కరీంనగర్ వచ్చిన ఆయనను తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబును అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణవాదుల్లో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన మామూలుగా వెళ్లిపోయారు. తమ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గండ్ర వెంకటేశ్వర రావు కుటుంబ సభ్యులను పరామర్సించడానికి చంద్రబాబు కరీంనగర్ వచ్చారు.

గండ్ర వెంకటేశ్వర రావు ఆదివారం ఉదయం హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని కరీంనగర్ తీసుకుని వచ్చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చంద్రబాబు వచ్చారు. గండ్ర వెంకటేశ్వర రావు మృతికి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గండ్ర వెంకటేశ్వరరావు చేసిన సేవలను ప్రశంసించారు. అంతకు మించి చంద్రబాబు మీడియాతో ఏమీ మాట్లాడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+