తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత పులి

By Pratap
|
Google Oneindia TeluguNews

Cheetah captured at Tirumala
తిరుపతి: తిరుమలలో సోమవారం మరో చిరుత బోనులో చిక్కింది. అంతకు ముందు అధికారులు మగ చిరుతను బోను వేసి పట్టుకున్నారు. దాన్ని అప్పట్లో వారు దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. సోమవారం ఉదయం తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 35వ మలుపు వద్ద ఆడ చిరుత బోనులోకి వచ్చి పడింది. దాన్ని జంతు ప్రదర్సనశాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జింకల పార్కు వైపు వస్తూ ఆ చిరుత బోనులో చిక్కినట్లు భావిస్తున్నారు.

ఇంతకు ముందు ప్రయాణికులపై చిరుత దాడి చేయడంతో చిరుతలను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక చిరుత చిక్కిన తర్వాత ప్రయాణికులకు బెడద తప్పిందని భావించారు. అయితే మళ్లీ దాడి చేయడంతో మరో చిరుత ఉందని గుర్తించి మళ్లీ బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మరో చిరుత బోనులోకి వచ్చి పడింది. దీంతో కాలి బాటన ప్రయాణికులకు చిరుతల బెడద తప్పినట్లే భావిస్తున్నారు.

జింకల పార్కు ఉన్నంత వరకు అక్కడ చిరుతల సంచరిస్తుంటాయని అటవీ శాఖ డిఎఫ్ఓ రవిశంకర్ అంటున్నారు. ఆ బోనును అట్లాగే ఉంచుతామని చెప్పారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో 20 దాకా చిరుతలు ఉండవచ్చునని ఆయన అన్నారు. కాగా, చిత్తూరు జిల్లాలోని మిట్టపల్లి వద్ద వెంకటేష్ అనే రైతు గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. మూడు గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X