జగన్, సోనియాలతో నరసింహన్ భేటీ మధ్యవర్తిత్వానికేనా?

సోనియా గాంధీతో నరసింహన్ 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. జగన్ వ్యవహారంపై నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ వెంట 27 మంది శాసనసభ్యులున్నారని నరసింహన్ తన నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా జగన్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి మందలించి ఆయనను దారికి తెచ్చుకోవడం మంచిదని గవర్నర్ అభిప్రాయపడినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ ను దారికి తేవడానికి నరసింహన్ తన వంతు పాత్ర పోషిస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా, ప్రధాని మన్మోహన్ సింగ్ తో నరసింహన్ 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వచ్చే ప్రధాని పర్యటనపై వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications