'సత్యం' రామలింగరాజు భూముల స్వాధీనం

ఎన్ ఫోర్స్ మెంటు అధికారులు స్వాధీనం చేసుకున్న భూములు ఇలా ఉన్నాయి - మంచాల మండలం లోయపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 329, 330, 331, 333, 334, 340, 342, 356, 368లలోని 489ఎకరాల భూమిని కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇవి రంగీత్ ఆగ్రో ఫామ్స్ (25 ఎకరాలు), తాప్తి ఆగ్రో ఫామ్స్ (45 ఎకరాలు), వేనా గ్రీన్ ఫీల్డ్ (47 ఎకరాలు), ఆర్య ఆగ్రో పేరిట (47 ఎకరాలు), దేవణార్థ ఆగ్రో (53 ఎకరాలు) , ఆయుర్ధ గ్రీన్ (21ఎకరాలు), రాంచంద్రరాజు (53 ఎకరాలు) సూర్య నారాయణ రాజు (54 ఎకరాలు), ఎస్వీ సోమరాజు (10 ఎకరాలు)ల పేరిట ఉన్నాయి. ఇవే కంపేనీల పేరుతో సర్వే నెంబరు 330, 338, 340, 342, 366, 368లలో మరో 134ఎకరాల భూములు కొనుగోలు చేశారు. వీటన్నింటినీ శుక్రవారం ఆధీనంలోకి తీసుకున్నారు.
రామలింగరాజు కొనుగోలు చేసిన భూములు రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా ఉన్నాయి. మొత్తం 327 కంపెనీల్లో 285 కంపెనీలకు సంబంధించిన ఆస్తులు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు కనుగొన్నారు. వీటిలో ఇబ్రహీంపట్నం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆకుల రాజయ్యను అడ్డుపెట్టుకుని బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేశారు. వ్యవసాయ ఆధారిత కంపెనీల పేరుతో వీటిని కొన్నారు.












Click it and Unblock the Notifications