34 దేశాల్లో 'సత్యం' రామలింగరాజు ఆస్తులు

మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో 347 ఆస్తులను అధికారులు గుర్తించారు. 132 మంది పేర్లతో దాదాపు 12వేల ఎకరాలు ఉన్నట్లు తేలింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ అధికారులు నాలుగు దఫాలుగా చట్టపరమైన అనుమతి తెచ్చుకున్నారు. వాస్తవంగా వీటిని రామలింగరాజు కుటుంబసభ్యులే స్వయంగా ఈడీకి దాఖలు పరచాల్సి ఉంది. తమ ఆస్తులు స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి లేదంటూ రామలింగరాజు కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదు. ఈడీ అధికారులు మాత్రం గుర్తించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే పని మొదలుపెట్టారు. రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం నడుస్తోంది. ఇప్పటి వరకూ వందకుపైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications