తారాస్థాయికి చేరిన వైయస్ జగన్ వ్యవహారం

కాగా, ఓదార్పు యాత్ర నుంచి వైయస్ జగన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఓదార్పు యాత్ర తీరును మార్చుకోవడానికి గానీ, వాయిదా వేసుకోవడానికి గానీ ఆయన సిద్ధంగా లేరు. అలా చేస్తే ఇచ్చిన మాటను తప్పడంగా, మడమ తిప్పడంగా ఆయన చెప్పుకుంటున్నట్లు సమాచారం. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను చేపట్టడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అందుకు సంబంధించి కార్యాలయాలు కూడా ఏర్పాటవుతున్నాయి. సాక్షి టీవీ చానెల్ లో వస్తున్న వార్తాకథనాలు కూడా ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర జరిగి తీరుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. జగన్ కోసం ప్రకాశం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ చానెల్ వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది.












Click it and Unblock the Notifications