వైయస్ జగన్ పై చర్యకు కాంగ్రెసు హైకమాండ్ కౌంట్ డౌన్?

పులివెందుల ఓదార్పు యాత్రలో పాల్గొన్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యమంత్రి మాటను వ్యతిరేకిస్తానని బహిరంగంగా ప్రకటించిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని ఉపేక్షించడం వంటి కారణాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అది ఓదార్పు యాత్రలో పాల్గొనడానికి ఇష్టపడని శాసనసభ్యులపై తీవ్ర ప్రభావం చూపేట్లుందని భావిస్తోంది. దీంతో జగన్ పైనే నేరుగా చర్య తీసుకునేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇందుకు గాను, ముఖ్యమంత్రి కె. రోశయ్యను, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. వీరిద్దరు మంగళవారం ఢిల్లీలో ఉంటారు. అలాగే పిసిసి మాజీ అధ్యక్షులను కూడా అందుబాటులో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. మొత్తం మీద, జగన్ పై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications