లెక్చరర్లపై ఒయులో దాడి: సీమాంధ్రలో పెల్లుబుకుతున్న నిరసనలు

తెలంగాణ వాదులు అనాగరికుల్లా ప్రవర్తిస్తూ, ఆటవిక చర్యలకు దిగుతున్నారని సమైక్యాంధ్ర ఐకాస కన్వీనరు ఎన్.శామ్యూల్, గౌరవాధ్యక్షులు పి.నరసింహారావు విమర్శించారు. ఈనెల 28న హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో బీఈడీ జవాబుపత్రాల మూల్యాంకనం చేస్తున్న అధ్యాపకులపై దాడిచేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అలాగే ఆదివారం నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో అధ్యాపక పోస్టుల ఇంటర్వ్యూలకు వెళ్లిన సీమాంధ్ర అభ్యర్థులను తరిమివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడులను ఖండిస్తూ సోమవారం సీమాంధ్రలోని పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సోమవారం నాగార్జున వర్సిటీలో పూర్తి బంద్‌కు పిలుపునిచ్చినట్లు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస కో-కన్వీనరు మండూరి వెంకటరమణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications