హైకమాండ్ పోటీ ఓదార్పు: వైయస్ జగన్ కు లాస్ట్ చాన్స్

స్థానిక ఎంపీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఓదార్పు కార్యక్రమం జరుగుతుందని సోమవారం విడుదల చేసిన మూడు పేరాల ప్రకటనలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ తెలిపారు. ఓదార్పును పార్టీయే అధికారికంగా నిర్వహిస్తున్నందున యాత్రను విరమించుకోవాలని ఈ ప్రకటన ద్వారా జగన్‌కు పరోక్షంగా సంకేతాలిచ్చింది. మొయిలీ ప్రకటనకు అనుగుణంగా నడుచుకుంటే జగన్ కడప లోక్‌సభ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.అందుకు విరుద్ధంగా వ్యక్తిగత ఓదార్పు యాత్రను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తే పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించినట్లే అవుతుందని ఈ ప్రకటనలో చెప్పకనే చెప్పారు. ఈ ప్రకటన అధిష్ఠానం నుంచి వచ్చిన తొలి అధికార పూర్వక హెచ్చరిక అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.












Click it and Unblock the Notifications