వైయస్ జగన్ ఓదార్పు కథ క్లైమాక్స్ చేరిందా?

YS Jagan
హైదరాబాద్: అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ప్రారంభించిన కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కథ క్లైమాక్స్ కు చేరుకుందా అనేది తెలియడం లేదు. ఈ కథ కంచికి ఎలా చేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ద్వారా చేసిన ప్రయత్నం ఫలించలేదు. పార్టీ అవసరం తనకు ఎంత ఉందో, తన అవసరం పార్టీకి అంతే ఉందంటూ మొయిలీ చేసిన రాజీ ప్రతిపాదనను జగన్ తోసి పుచ్చి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా గిద్గలూరులో ఆయన జనం నీరాజం పట్టారు. దీంతో ఆయన ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగి ఉంటుంది. ఈ స్థితిలో జగన్ ఎలా దారికి తేవాలనేది పార్టీ అధ్యక్షురాలు సోనియాకు సమస్యగానే మారవచ్చు.

వరుసగా నాలుగోసారి సోనియా ఎఐసిసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె శుక్రవారం అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ తీసుకోనున్నారు. ఈ సమయంలోనే జగన్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అధ్యక్షురాలిగా ఆమె ప్రథమ ప్రాధాన్యం వైయస్ జగన్ సమస్య పరిష్కారానికే ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. వైయస్ జగన్ వ్యవహారం బ్లాక్ మెయిల్ పద్ధతిలో ఉందని సోనియానే కాదు, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా భావిస్తున్నారు. ఏడాది కాలంగా జగన్ వ్యవహారం నలుగుతూ వస్తోంది. దీనికి ఎలా ముగింపు పలకాలనేదే సోనియా ముందున్న ప్రశ్న.

జగన్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అధిష్టానాన్ని ఆయన శుక్రవారం ఓదార్పు యాత్రలో పల్లేత్తు మాట అనలేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆయన క్లుప్తంగా ప్రసంగించారు. ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసి అందులో పాల్గొంటున్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై అధిష్టానం తొలి వేటు వేస్తుందా, నేరుగా వైయస్ జగన్ పై చర్యకు ఉపక్రమిస్తుందా అనేది తేలడం లేదు. అయితే, జగన్ పై చర్య తీసుకునేందుకు మరి కొద్ది రోజులు ఆగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+