వైయస్ సతీమణి విజయమ్మకు ముఖ్యమంత్రి రోశయ్య లేఖ

కాగా, తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల ఫలితాలు అర్హులైనవారికి అందాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల స్థాపనకు తాను ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. 2009లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తనకు సహకరించిన మంత్రులకు, శాసనసభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications