ఆర్ట్స్ కళాశాల పైనుంచి దూకుతామని విద్యార్థుల బెదిరింపు

గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయకపోతే తర్వాతి పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఒయు విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. రేపు జరగబోయేది ప్రళయమని నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులంటున్నారు. కాంగ్రెసు హై కమాండ్ వెంటనే దిగి వచ్చి తమ 42 శాతం తెలంగాణ వాటాను వెంటనే తేల్చాలని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పిడిన తర్వాత తమ పరీక్ష తాము నిర్వహించుకుంటామని వారంటున్నారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications