హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమని అనలేదు: వికె దుగ్గల్

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమని తాను అనలేదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ స్పష్టం చేశారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా పరిశీలిస్తామనిఎక్కడా ఎవరితోనూ తాను అన్నానని ఆయన ప్రశ్నించారు. అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పినట్లు ఆయన వివరించారు. తమది దిక్కుమాలిన కమిటీ కాదని, దిక్కున్న కమిటీ అని, కేంద్ర ప్రభుత్వానికి దిక్కు చూపిస్తామని జస్టిస్ శ్రీకృష్ణ తెలుగులో అన్నారు.

గడువులోగా కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని దుగ్గల్ చెప్పారు. తాము సీమాంధ్ర, తెలంగాణలోని అందరి అభిప్రాయాలు సేకరించామని, అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇవ్వగలమనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తమ నివేదిక ప్రజలందరి మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. తాము తీసుకున్న అభిప్రాయాలపై చైర్మన్, సభ్యులం కలిసి చర్చించుకున్నామని ఆయన అన్నారు. అక్టోబర్ లో చివరిసారిగా మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+