దిగొచ్చిన నిర్మాతలు: పవన్ సినిమా నుంచి కొమరం తొలగింపు

నల్గొండ, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పోస్టర్లు చించి వేశారు. దీంతో థియేటర్ యాజమాన్యాలు చిత్రాన్ని నిలిపివేశాయి. దీంతో జెఎసి డిమాండుకు నిర్మాతలు తలొగ్గారు. దిగొచ్చిన నిర్మాతలు శీర్షికలోని కొమరంను తొలగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడైన కొమరం భీంపేరులోని పేరును ఉద్ధేశ్య పూర్వకంగా పెట్టలేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపర్చకూడదనే కొమరంను తీసివేస్తున్నట్టు చెప్పారు. దీనిపై తెలంగాణవాదులు, ఓయూ జెఎసి స్పందించింది. పేరును తొలగించటం పట్ల తెలంగాణ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జెఎసి నాయకుడు రాజారాం మాట్లాడుతూ చిత్రంలోని కొమరంను తొలగించకుంటే అడ్డుకుంటామని ముందే చెప్పామని, అయినా హెచ్చరికలను ఖాతరు చేయకుండా విడుదల చేశారు. అన్నట్టుగానే మేం అడ్డుకున్నాం. ఇంతటితో ఆగేది లేదు. తెలంగాణకు చిరంజీవి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు అడ్డుకునే నిర్ణయాన్ని అలోచిస్తామన్నారు. మరో జెఎసి నాయకుడు కైలాస్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పులిలా గాండ్రించిన కొమరం భీం పేరును వాడుకుంటూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటాన్ని యావత్ తెలంగాణ వ్యతిరేకిస్తోందన్నారు. పేరును తొలగించడంతో పాటు తెలంగాణపై అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే వరకు అడ్డుకుంటామన్నారు. అరెస్టులకు, పోరాటాలకు అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యమాన్ని కొనసాగించే దిశలోనే ఆలోచిస్తామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications