వైయస్సార్ అక్రమాల చిట్టాపై సోనియా గాంధీ సీరియస్

రాష్ట్ర పరిస్థితుల గురించి సోనియాకు తనకంటే ఎక్కువగా తెలుసన్న విషయం ఆమెతో మాట్లాడిన తర్వాత అర్థమైందన్నారు. రాజకీయాంశాలు, ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులు, ఎమ్మార్ కుంభకోణాల గురించి చెప్పినప్పుడు ఆమె అన్నీ తనకు తెలుసని పేర్కొన్నట్లు తెలిపారు. జగన్ ఓదార్పు యాత్ర గురించి అధిష్ఠానానికి ఇది వరకే పూర్తిగా తెలుసు కాబట్టి తానేమీ ఆ విషయం గురించి చెప్పలేదన్నారు. జలయజ్ఞంపైనా ఆయన సోనియాకు ఫిర్యాదు చేశారు.
శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం సోనియా గాంధీతో భేటీ అయినట్లు తెలిసింది. రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ అధ్యక్షురాలిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులను కూడా కలిశారు. వంశధార ట్రైబ్యునల్ పనిమీద ఢిల్లీకొచ్చిన భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా సోనియా అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications