అందరినీ వదిలేసి నా మీద పడతారేం? టీజీ వెంకటేష్

TG Venkatesh
కర్నూలు‌: హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భూమిని కోల్పోయిన తనకు ప్రత్యా మ్నాయంగా ప్రభుత్వం కేటాయించిన భూమి, టీఆర్‌ఎస్‌ భవన్‌ కోసం భూమి కేటాయింపు అంశాలపై న్యాయ విచా రణకు తాను సిద్ధమని కర్నూలు ఎమ్మెల్యే, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షుడు టిజి వెంకటేశ్‌ ప్రకటిం చారు. టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు హైదరాబాద్‌లో ఆదివా రం చేసిన ప్రకటనపై టీజీవీ స్పందించారు. ఈ మేరకు కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎవరితో న్యాయవిచారణ జరిపించినా సరే దానికి తాను సిద్ధమేనని ఆయన చెప్పారు. న్యాయవిచారణలో తనది అక్రమమని తేలితే తనకు కేటా యించిన భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

మరిటీ ఆర్‌ ఎస్‌ ది తప్పని తేలితే ఆ భూమిని ప్రభుత్వానికి కేటాయించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమేనా? అని ఆయన సవాల్‌ విసిరారు. రింగ్ ‌రోడ్డు అలైన్‌మెంట్లలో పలుమార్పుల్లో తాను పరిశ్రమ కోసం కొనుగోలు చేసిన భూమిని స్వాధీనం చేసుకోవ డాన్ని సవాల్‌ చేస్తూ తాను హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నా రోడ్డు నిర్మాణం చేసిన కారణంగా తనకు ప్రత్యామ్నాయ భూమిని చట్టబద్ధంగా కేటాయించారని ఆయన వివరిం చారు. భూమికి భూమి పరిహారంగా చాలామంది తీసుకు న్నారని, హరీష్ ‌రావు వారందరినీ వదిలేసి తనపై ఆరోపణలు చేయడం అర్థరహితమని టిజి విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+