ప్రియుడి మోజులో కన్నబిడ్డను హత్య చేసిన కసాయి మహిళ

Adilabad District
ఆదిలాబాద్: ప్రియుడి మోజులో పడిన మహిళ తన కన్నబిడ్డనే కబళించిన దారుణ సంఘటన కలకలం సృష్టించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులోని శాంతినగర్ లో జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా గర్భం దాల్చిన మహిళ శిశువును కన్నది. అయితే, ఎవరి కంట పడకుండా కన్నబిడ్డను ఆ తల్లి గొంతు నులిమి చంపేసింది. ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులను ఆ మహిళను ప్రశ్నించారు. పురుటిలోనే బిడ్డ చనిపోయిందని ఆ మహిళ తొలుత బుకాయించింది. అయితే, చివరకు పోలీసుల వద్ద తన నేరాన్ని అంగీకరించింది. ఆమె ప్రియుడు మాత్రం పరారీలో ఉన్నాడు. శిశువును చంపిన మహిళపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజలు పెద్ద యెత్తున ఆస్పత్రికి తరలి వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+