వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఆదివారం నుంచే

ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో 40శాతం యాత్ర మాత్రమే పూర్తయింది. జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో యాత్ర కొనసాగించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్యుల సూచనలు పాటించకుండా యాత్ర కొనసాగించి ఇబ్బంది పడేకంటే మరో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని యాత్ర నిరాటంకంగా కొనసాగించడమే ఉత్తమమని భావించినట్లు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు చెప్పారు. జగన్ పై ఒత్తిడి తెచ్చి తాము అంగీకరింపజేశామని, ఆదివారం నుంచి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యాత్ర కొనసాగుతుందని ప్రకటించారు.












Click it and Unblock the Notifications