ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మేరీకోం మరోసారి భారత పతాకాన్ని ఎగురవేసింది. బ్రిడ్జిటౌన్ లో జరుగుతున్న మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఖేల్ రత్న మేరీకోం 48 కిలోల విభాగంలో రుమేనియాకు చెందిన స్టెలుటాను ఓడించి, ఐదోసారి ఛాంపియన్ షిప్ నెగ్గింది. ఇద్దరు పిల్లల తల్లి ఐన మేరికోం 2002, 2005, 2006, 2008లో ఛాంపియన్ షిప్ ను నెగ్గింది. దీంతో 5వసారి భారత్ కు చెందిన ఓ మహిళా బాక్సర్ ఛాంపియన్ షిప్ దక్కించుకున్నదిగా మేరీకోం ఘనత దక్కించుకున్నది.