వైయస్ జగన్ ఓదార్పు గుట్టు విప్పిన మామ రవీంద్రనాథ్ రెడ్డి

Ravindranath Reddy
హైదరాబాద్: తన అల్లుడు, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర గుట్టును కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి విప్పారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఆయన సంచలన ప్రకటన చేశారు. సోమవారం సచివాలయానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మరికొంత మంది సిఎం పీఠం కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య తనపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రోశయ్య ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆయన అన్నారు.

తన ఎరుపుల లారీల పట్టివేత విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలని, వ్యవసాయ శాఖ చేయాల్సిన పనిని పోలీసులు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎరుపుల విషయంలో పోలీసులకు సంబంధమేమిటని ఆయన అడిగారు. తనపై కేసు పెట్టారని అంటున్నారని, కేసు పెట్టారో పెట్టలేదో కూడా తెలియదని ఆయన అన్నారు. మంత్రి రఘువీరా రెడ్డి తనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని వస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+