హైదరాబాద్: హైదరాబాద్ లోని సరూర్ నగర్ మండలం నాదర్ గుల్ లో బిడ్డలతో కలసి ఓ భార్య భర్తను హత్య చేసింది. విద్యాశాఖలో పనిచేస్తున్న ఇస్మాయిల్, భార్య అక్తర్ బేగం, ఇద్దరు పిల్లలతో కలసి నాదర్‌గుల్‌లో నివాసముంటున్నాడు. భర్త వేధింపులు అధికం కావడంతో ఇద్దరు కొడుకులతో కలసి అక్తర్ బేగం ఇస్మాయిల్ ను హతమార్చింది.
ముగ్గురు కలసి రోకలి బండతో కొట్టడంతో ఇస్మాయిల్ ప్రాణాలు కోల్పోయాడు. మీర్‌పేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.