చంద్రబాబుకు తెలంగాణ దెబ్బ: పరిగి బహిరంగ సభ రద్దు

ఒకరిద్దరు రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులు మాత్రం పరిగి బహిరంగ సభ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, అలా నిర్వహించడం వల్ల తెలంగాణవాదులను రెచ్చగొట్టినట్లవుతుందని, దాని వల్ల లాభం జరగకపోగా నష్టం వాటిల్లుతుందని భావించి బహిరంగ సభ వద్దని చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబును అడ్డుకుంటామని ఒయు జెఎసి గానీ రాజకీయ జెఎసి గానీ ప్రకటించలేదు. అయినా చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో పర్యటన జరిపితే మరింత వ్యతిరేకత ఎదురవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో పరిస్థితిని బట్టి తదుపరి పర్యటన చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications