వైయస్ జగన్ పై రాహుల్ కన్నెర్ర: యువజన కమిటీల రద్దు

అధిష్టానం మాట పెడచెవిన పెట్టి ఓదార్పును కొనసాగిస్తున్న జగన్ ను ఎంత సాధ్యమైతే అంతగా ప్రాబల్యం తగ్గించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా రాహుల్ కమిటీలు రద్దు చేయడానికి కారణాలు ఆయా కమిటీల్లోని సభ్యులంతా జగన్ వర్గం వారు కావడమేనని సమాచారం. రాష్ట్ర కాంగ్రెసు లోని కమిటీలలో చాలా వరకు సభ్యులు జగన్ వర్గీయులు ఉన్నారు. ధిక్కారంతో సాగుతున్న ఓదార్పులో వీరంతా పాల్గొని అధిష్టానానికి మరింత కోపం తెప్పించటంతో రాహుల్ రద్దుకు పూనుకున్నాడు. జగన్ వర్గానికి చెక్కు పెట్టి కిందిస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురి జగన్ వర్గీయులపై వేటు పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications