తెలంగాణ యాత్రకు చంద్రబాబు నాయుడు మరో ప్లాన్

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి తెలంగాణలో పర్యటించే వరకు నిద్రపట్టేట్లు లేదు. ఆయన తెలంగాణ జిల్లాల్లో పర్యటించేందుకు మరో ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. ప్రతి 15 లేదా 10 రోజులకు ఒకసారి తెలంగాణలో పర్యటించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు వెళ్లిపోతుండడంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ వలసలను ఆపడానికి తెలంగాణ జిల్లాల్లో పర్యటించక తప్పదనే ఉద్దేశంతో ఉన్నారు. తెరాసలోకి వెళ్తే భవిష్యత్తు ఉండదని ఆయన పార్టీ కార్యకర్తలకు నచ్చ జెప్పాలనే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు.

తన యాత్రను అడ్డుకుంటున్నవారు 4 వేల మందికి మించి లేరనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వారి వల్లనే చంద్రబాబు తెలంగాణ యాత్రకు ఆటంకాలు ఎదురువుతున్నాయనే అవగాహనతో ఉన్నారు. వారిని ఎదుర్కోవడం కష్టం కాదనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. అందుకు దీటుగా చంద్రదళం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఈ దళం ద్వారా తెరాసకు చెందిన విద్యార్థులను ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. ఆ దళం భద్రత మధ్య తెలంగాణలో చంద్రబాబు పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+