తెలంగాణ కోసం కరీంనగర్ లో విద్యార్థి ఆత్మహత్య

గత సంవత్సరం ప్రకటించిన తెలంగాణను వెనక్కి తీసుకున్నారని, ఎన్నికల్లో అందరూ తెలంగాణ అని ఇప్పుడు మాత్రం అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందాడు. ముంగిలి దాకా వచ్చిన ప్రత్యేక రాష్ట్రాన్ని మళ్లీ మళ్లీ వెనక్కు తీసుకు వెళుతున్నారని అజయ్ తన సూసైడ్ నోట్ లో ఆవేదన చెందారు. అజయ్ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో చురుగ్గా పని చేసేవాడు. తెలంగాణ విషయం ఎప్పుడూ ముందుకొచ్చి వెనక్కు మళ్లుతుందని ఆవేదన చెందాడు. తాను చంద్రబాబు అన్న మాటలను తీవ్రంగా నొచ్చుకున్నట్టు అందులో పేర్కొన్నాడు. చివరలో జై తెలంగాణ అంటూ రాసి ముగించాడు.
కాగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబునాయుడు మాటలకు తెలంగాణవాదులు, విద్యార్థులు చాలామంది మనస్థాపం చెందారు. కొందరు నిరసన తెలిపారు, మరికొందరు బాబు ధోరణిని దుయ్యబట్టారు. కొందరు ఆత్యహత్యకు ప్రయత్నించారు. వరంగల్ కు చెందిన బాలు అనే విద్యార్థి సైతం నిన్న ఆత్యహత్యకు ప్రయత్నించాడు.












Click it and Unblock the Notifications