ఆంధ్రజ్యోతి దినపత్రిక చంద్రబాబు చేతిలోకి పోదు

ఆంధ్రజ్యోతి దినపత్రికను చంద్రబాబు తన చేతికి తీసుకుంటున్నట్లు, దాంతో అందులో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు ఉద్వాసన పలుకనున్నట్లు పెద్ద యెత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాధాకృష్ణ తీవ్రంగా ప్రతిస్పందించారు. అదంతా తన శత్రువులు చేస్తున్న ప్రచారమని ఆయన మండిపడ్డారు. అలాంటి ప్రచారం చేస్తున్నవారిని ఆయన వైరభక్తులుగా అభివర్ణించారు. తమపై శత్రుత్వంతో తమనను ప్రజలకు వారు తమను ప్రజలకు మరింత ప్రేమపాత్రులను చేశారని ఆయన అన్నారు. రాధాకృష్ణ వివరణ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక ప్రచారం చేస్తోందనే అర్థాన్నిస్తోంది.












Click it and Unblock the Notifications