చిరంజీవి మౌనంపై ప్రజారాజ్యం క్యాడర్ ఆగ్రహం

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై పార్టీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన మౌనాన్ని క్యాడర్ తీవ్రంగా తీసుకుంటోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోపాడ శ్రీను అనే కార్యకర్త శుక్రవారం మరణించాడు. అన్రాక్ అల్యూమినియం ఫ్యాక్టరీ వల్ల భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలంటూ చేసిన ఆందోళన సందర్భంగా పోలీసుల లాఠీచార్జీలో మోపాడ శ్రీను తీవ్రంగా గాయడి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ రెండో మరణం తర్వాత కూడా చిరంజీవి నోరు మెదపకపోవడం పట్ల పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రజారాజ్యంపార్టీ (పీఆర్పీ) నేత అశ్వర్థ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అశ్వర్థ సూసైడ్ నోటులో పేర్కొన్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవే సంఘటనలు ఇతర పార్టీల్లో జరిగి ఉంటే పెద్ద యెత్తున ఆందోళనలకు దిగి ఉండేవారు. కానీ, చిరంజీవి ఏ మాత్రం కదలడం లేదు. ప్రజా చైతన్య యాత్రలంటూ పర్యటనలు చేసిన చిరంజీవి పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. తన 150వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవికి పార్టీని, పార్టీ కార్యకర్తలను పట్టించుకునే సమయం కూడా చిక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+